03-11-2025 01:26:13 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 2 (విజయక్రాంతి): భాగ్యనగరంలో ఆదివారం సా యంత్రం భారీ వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారి, ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడింది. గంట వ్యవధిలోనే నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. రహదారులు చెరువులను తలపించడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించి, వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో రోడ్లన్నీ నీట మునిగాయి. బయోడైవర్సిటీ జంక్షన్, ఐకియా, మైండ్‌స్పేస్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు గంటలతరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారు.
అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట, యూసుఫ్‌గూడ సికింద్రా బాద్, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, జవహర్నగర్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్ బంజారాహి ల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. హైడ్రా బృందాలు రంగంలోకి దిగి, రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనులు చేశాయి.