02-10-2025 01:08:09 AM
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇది కాస్త తీవ్ర వాయుగుండంగా మారి ఈ నెల 3న ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశముందని పేర్కొంది.
దీంతో దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలలో గురు, శుక్రవారాలు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.