calender_icon.png 27 October, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నత్త నడకన సబ్ స్టేషన్ నిర్మాణం

27-10-2025 12:12:25 AM

ఐదేళ్లు గడుస్తున్న పూర్తికాని వైనం 

కల్వకుర్తి అక్టోబర్ 26 : విద్యుత్ వినియోగం పెరగడంతో రైతులకు లోవోల్టేజ్ సమస్య అధికమై ట్రాన్స్ పార్మర్లు మోటార్లు తరచుగా కాలిపోతుండటంతో కల్వకుర్తి మండలం ముకరాలలొ అధికారులు, పాలకులు సబ్ స్టేషన్ నిర్మాణానికి పునాదులు వేశారు. సంవత్సరంలో పనులు పూర్తవుతాయని శిలాఫలకం వేసినప్పటికీ కాంట్రాక్టర్ నత్త నడకన పనులను చేస్తుండటంతో నేటికీ సబ్ స్టేషన్ రైతులకు అందుబాటులోకి రావడం లేదు.

ఫౌండేషన్ వేసి అరేళ్ళు పూర్తయినా ఇప్పటి వరకు పనులు పూర్తి చేయకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.  గ్రా మంలో సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే విద్యుత్ సమస్య ఉండబోదని మోటార్లు మరమ్మతులకు రావని రైతులు భావించినప్పటికీ ఏళ్ళు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. పనులు దక్కిం చుకున్న కాంట్రాక్టర్ నామమాత్రంగా అప్పుడప్పుడు కొంత పని చేసుకుంటూ కాలం వెలదీస్తున్నారు.

నిధులు రాకపోవడం పాలకులు ఎవరూ ప్రత్యేక దృష్టి సాధించకపోవడంతో ఈ ప్రాంత రైతుల కరెంటు కష్టాలు తీరడం లేదు. కొద్ది రోజుల క్రితం సబ్ స్టేషన్ నిర్మాణం పనులు వేగవం తం చేసి తిరిగి మళ్ళీ నిలిపివేశారు. సబ్ స్టేషన్ లో ప్రధాన భాగమైన ట్రాన్స్ఫార్మర్ అమర్చినప్పటికీ ఇతర చిన్న చిన్న పనులు అసంపూర్తిగా ఉండడంతో ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సబ్ స్టేషన్ నిర్మాణ పనులను పూర్తి చేసి రైతులకు నాణ్యమైన కరెంటు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులుకోరుతున్నారు.