17-11-2025 12:00:00 AM
ఆవిష్కరించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, నవంబర్ 16 (విజయకాంతి):సిద్దిపేటలోని విక్టరీ చౌరస్తా వద్ద పార్క్ ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్యే దివంగత ఆనంతుల మదన్ మోహన్ విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి హరీష్ రావు ఆదివారం ఆవిష్కరించారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, వరంగల్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు మదన్ మోహన్ పేరు పెట్టేలా కృషి చేస్తానని చెప్పారు. మదన్ మోహన్ సేవలను కొనియాడారు.
వైశ్య సంఘం కార్యవర్గానికి శుభాకాంక్షలు: సిద్దిపేట పట్టణ వైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే హరీష్ రావును క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వైశ్య సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు. సత్యసాయి శత జయంతి వేడుకలకు ఆహ్వానం :ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగే భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలకు సిద్దిపేట సత్య సాయిబాబా దేవాలయ నిర్వాహకులు హరీష్ రావును ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆహ్వాన పత్రిక, ప్రసాదాన్ని అందజేశారు.