17-11-2025 12:00:00 AM
ఆస్పత్రిని ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యేలు
ఆదిలాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) : వెనుకబడిన, మారుమూల జిల్లా అయినా ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడిప్పుడే ప్రజలకు ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా మెరుగైన, కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లు పేర్కొన్నారు.
స్థానిక గరల్స్ హై స్కూల్ పక్కన డాక్టర్ కీని దిలీప్ రెడ్డి, డాక్టర్ సయుక్తా రెడ్డిల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన దిలీప్ రెడ్డి ప్రైవేట్ ఆస్పత్రిని (మెటర్నిటీ, లాప్రోస్కోపీ సర్జికల్) సెంటర్‌ను ఆదివారం ఎంపీ, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇప్పుడిప్పుడే జిల్లాలో అధునాతన పద్ధతిలో వైద్య సేవలు అందించేలా ప్రైవేట్ ఆస్పత్రులు ఏర్పాటు అవుతున్నాయని, దీంతో వైద్యం కోసం ఇతర జిల్లాలకు వెళ్ళకుండానే, రవాణా చార్జీలు భారం కాకుండా జిల్లాలోని పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి, డాక్టర్ దిలీప్ రెడ్డి తండ్రి రాజారెడ్డి, లోక వసంత్ రెడ్డి, విలాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.