calender_icon.png 1 July, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్

01-07-2025 02:09:27 AM

  1. విదేయుడికే పట్టం కట్టిన బీజేపీ అధిష్ఠానం
  2. నేడు విజయవాడ బీజేపీ కార్యాలయంలో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ
  3. పరిశీలకుడిగా వ్యవహరించనున్న కర్ణాటక ఎంపీ మోహన్

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ను రేపు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధి కారికంగా నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిం చేందుకు బీజేపీ అధిష్ఠానం కర్ణాటకకు చెందిన ఎంపీ మోహన్‌ను ఎన్నికల పరిశీలకుడిగా నియమిం చింది.

కాగా సోమవారం మధ్యాహ్నంతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నామినేషన్ల గడువు ముగియగా.. పీవీఎన్ మాధవ్ ఒక్కరే ఐదుసెట్ల నామినేషన్ పత్రా లు దాఖలు చేశారు. దీంతో పార్టీ విధేయులకు బీజేపీ పెద్దపీట వేస్తోందని మరోసారి వెల్లడైంది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికే పదవులు అని బీజేపీ స్పష్టం చేసింది. సీనియర్లు, ఆశావహులకు షాకిస్తూ.. సంఘ్ నేపథ్యం ఉన్న మాధవ్‌కు అప్పగించడం కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమని చెప్పొచ్చు. 

ఏబీవీపీతో రాజకీయ ప్రస్థానం..

పీవీఎన్ మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. 1973 ఆగష్టు 10న విశాఖపట్టణం జిల్లా మద్దిలపాలెంలో జన్మిం చారు. కాస్ట్ అకౌంటెంట్ కోర్సు చదవిన మాదవ్ ఆ తర్వాత ఏయూలో ఎంబీఏ చదివారు. ఆయన రాజకీయ ప్రయాణం ఏబీవీపీతో ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచి రాష్ర్ట స్వయం సేవక్ సంఫ్‌ులో చురుకుగా ఉన్నారు. విద్యార్ధి నాయకుడుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మాధవ్.. విద్యార్ధి, సామాజిక అంశాలపై పోరాటం సాగించారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన  మాధవ్.. 2009లో తొలిసారి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2017లో టీడీపీ--బీజేపీ--జనసేన బలపరచడంతో ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్‌గానూ పని చేశారు. ఆరేళ్లపాటు ఎమ్మెల్సీగా పనిచేసిన మాధవ్.. ఇప్పుడు బీజేపీ ఏపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

సంఘ్ నేపథ్యంతో పాటు ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత, బీసీ ఫ్యాక్టర్ వంటివి కలిసి వచ్చాయి. కాగా మాధవ్ తండ్రి చలపతిరావు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఇప్పుడు మాధవ్ అధ్యక్షుడిగా ఎంపికవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇదో రికార్డుగా మారనుంది. మాధవ్ తండ్రి చలపతిరావు.. కాషాయ పార్టీకి తొలితరం నాయకుడు. ఆయన ఎమ్మెల్సీగా, ఉమ్మడి ఏపీ తొలి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న బీజేపీ సీనియర్ నేతలకు చలపతిరావు గురువు కావడం విశేషం.