calender_icon.png 1 July, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందాలు వేసుకొని.. రోడ్లకు మరమ్మతులు

01-07-2025 02:08:58 AM

నాయకులు, అధికారులు చేయనిపని ప్రజలే చేసుకున్నారు 

బెజ్జూర్, జూన్30(విజయక్రాంతి): బెజ్జూ ర్ మండలంలోని మోగవెల్లి గ్రామంలో ప్రజలు ఏకమై నాయకులు, అధికారులు చేయని పనిని ప్రజలే చేసుకున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలో రోడ్లన్నీ బురదమయంగా మారడంతో ప్రజలందరూ ఏకమై చందాలు వేసు కుని బురద రోడ్లపై మొరల పోసి చదును చేసుకుని రోడ్లు బాగు చేయించుకున్నారు. పలుమార్లు నాయకులకు, అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో ప్రజలందరూ ఏకతాటికి వచ్చి గ్రామంలోని నాలుగు గల్లి రోడ్లను బాగు చేయించుకున్న ట్లు తెలిపారు.

ఎన్నికల సమయంలోనే నాయకులు అది చేస్తాం ఇది చేస్తామని చెప్ప డం వరకే తప్ప చేసింది ఏమీ లేదని గిరిజన గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, నాయకులు స్పందించి గిరిజన గ్రామలలో రోడ్లు మం జూరు చేసి ప్రజల రవాణా కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్ర మంలో ఆలం సీతారాం,నరేష్, జలపతి, ఆత్రం మాధవరావు, బాపూరావు, రవి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.