25-07-2024 12:05:00 AM
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకర్
యాదాద్రి భువనగిరి, జూలై24 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఆగస్టు 9న దేశ రాజధాని ఢిల్లీలో మాదిగ మహాధర్నాను నిర్వహిస్తున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ల శంకర్ మాదిగ తెలిపారు. బుధవారం భువనగిరిలో మహాధర్నాకు సంబంధించిన కరపత్రాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరెళ్ల రమేష్ మాదిగతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగ, మాదిగ ఉపకులాల న్యాయమైన డిమాండ్ ఏబీసీడీ వర్గీకరణ అని, పదేండ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని మోసం చేసిందన్నారు.
వర్గీకరణ జరగనందున విద్యా, ఉద్యోగావకాశాల్లో మాదిగలకు తీవ్ర నష్టం జరుగుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన హలో మాదిగ.. ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు భూషి మహేష్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంగపురం స్వామి, రాష్ట్రకార్యదర్శి బైరపాక నాగరాజు, బొట్ల శ్రీనివాస్, సంగి స్వామి పాల్గొన్నారు.