14-11-2025 02:28:34 PM
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు వంద సీట్లు..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ విజయంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) మీడియా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని మహేష్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుతో ప్రజలు బీఆర్ఎస్ కు సెలవు చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు చోటు లేదని మరోసారి రుజువైందని ఆయన స్పష్టం చేశారు.
రానున్న రోజుల్లోనూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతోందని మషేష్ గౌడ్ తెలిపారు. నీవన్ యాదవ్ ను గెలిచిపించిన ఘనత.. సీఎం, మంత్రులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తదని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు సాధించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం పదేళ్లు అధికారంలో కొనసాగడం తథ్యం అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పనితీరు పట్ల ప్రజలు సంతృత్తిగా ఉన్నారని మహేష్ గౌడ్ తెలిపారు. ఈ విజయంపై సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ తరుఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్ విజయం జీహెచ్ఎంసీ ఎన్నికలకు నాంది అని మషేష్ గౌడ్ స్పష్టం చేశారు.