12-02-2025 04:38:54 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 35వ వార్షికోత్సవాన్ని పురస్కరుచుకుని బుధవారం కల్యాణోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మూడు రోజుల ఉత్సవాలు భంగ నిర్వహించిన కళ్యాణోత్సవానికి పట్టణం నుండి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివార్లకు డిసిసి అధ్యక్షులు శ్రీరరావు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మున్సిపల్ చైర్మన్ గంట ఈశ్వర్ తదితరులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.