calender_icon.png 4 August, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్పక్ బస్సుల్లో ఛార్జీల తగ్గింపు

03-08-2025 12:19:34 AM

-50 నుంచి 1౦౦ తగ్గిస్తూ నిర్ణయం

శేరిలింగంపల్లి, ఆగస్టు 2 : హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తీపి కబురు అందించింది. విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ ఎయిర్కండిషన్డ్ బస్సుల్లో ఛార్జీలను రూ.50 నుంచి రూ.100 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న ఛార్జీలతో పోల్చితే, పలు మార్గాల్లో ప్రయాణదూరానికి తగ్గట్టే తగ్గింపు చేసినట్టు అధికారులు తెలిపారు. ఉదాహరణకు ఎయిర్పోర్టు నుంచి శంషాబాద్ వరకు ఇప్పటి వరకు రూ.200 గా ఉన్న ఛార్జీ ఇకపై రూ.100 మా త్రమే. అలాగే, మెహదీపట్నం మార్గంలో రూ.350 బదులు రూ.300, ఎల్బీనగర్ మార్గంలో రూ.350 బదులు రూ.300 వసూలు చేయనున్నారు.

ఇక రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య నడిచే ప్రత్యేక సేవల ఛార్జీల్లోనూ రూ.50 తగ్గించారు. ఈ తగ్గింపు జూబ్లీ బస్టాండ్, జేఎన్టీయూ, మియాపూర్, లింగంపల్లి వంటి ప్రాంతాల ప్రయా ణికులకు ప్రయోజనకరంగా మారనుంది. ఇప్పటి వరకు ఈ మార్గాల్లో రూ.450 ఛార్జీలుండగా, ఇప్పుడు రూ.400కే ప్రయాణం చేసుకునే వెసులుబాటు కల్పించారు. విమా న ప్రయాణికులు, విదేశాల నుంచి తిరిగివచ్చే వారు, రాత్రిపూట ఎయిర్పోర్టు చేరేవారికి ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. ప్రయాణికుల స్పందనను బట్టి మరిన్ని మార్గాల్లో అదనపు సేవలు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.