25-08-2025 01:20:00 AM
బూర్గంపాడు,ఆగస్టు24(విజయక్రాంతి): రాష్ట్ర రోడ్డు,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్ ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు మహంకాళి రామారావు హైదరాబాదులో జూబ్లీహిల్స్ గల తన స్వ గృహం నందు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చంతో సత్కరించి భద్రాచలంలో కొలువున్న భద్రా ద్రి రామయ్య ప్రసాదం, అక్షింతలు అందజేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీల కు నిర్ణయించిన 42 శాతం రిజర్వేషన్లపై చర్చించారు. బీసీల రిజర్వేషన్ల సాధనకై బిసి మంత్రులు పోరాడి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షు లు టి.ఆర్ చందర్, విద్యార్థి సంఘం అధ్యక్షులు బండారు రాజు, ఉపాధ్యక్షులు చిప్పా రాజు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.