calender_icon.png 25 August, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోడు భూమిలో పత్తి పంట ధ్వంసం

25-08-2025 01:20:57 AM

బూర్గంపాడు,ఆగష్టు 24(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం గోపాలపురానికి చెందిన సర్ప సరస్వతి రెండు ఎకరాల పోడు భూమిలో పత్తి పంట సాగు చేసింది. ఫారెస్ట్ అధికారు లు శనివారం సుమారు ఎకరం మేర పత్తి పంటను పీకేసారని ఆమె వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేత సీతారాం నాయక్ ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.పూత దశకు వచ్చిన పత్తి మొక్కలను పీకేయడం సరికాదని,ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.