31-07-2025 01:08:24 AM
- 382.5 కోట్లతో అభివృద్ధి
- మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): అలంపూర్ జోగుళాంబ ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని, ఆలయం మూడు విడతల్లో అభి వృద్ధి చేస్తున్నామని, మొత్తం రూ. 382.5 కోట్లతో అభివృద్ధి చేపడుతున్నట్లు రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వివరించారు. బుధవారం సచివాలయంలో జోగులాంబ ఆలయ మాస్టర్ ప్లాన్‌పై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సురే ఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మం త్రి సురేఖ మాట్లాడుతూ జోగులాంబ ఆలయాల అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడబోదన్నారు.
రాష్ర్టంలోని అన్ని దేవాల యాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు. కృష్ణ, -తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో జోగులాంబ శక్తి పీఠం ఉందని, ఈ దేవాల య ప్రగతికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సురేఖ అన్నారు. రానున్న రోజుల్లో భక్తులు, సందర్శకులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చినా, ఆ మేరకు నిర్మాణ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ వెంకటరావు, తెలంగాణ ధార్మిక్ అడ్వజర్ గోవిందహరి తదితరులు పాల్గొన్నారు.