calender_icon.png 6 August, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముమ్మరంగా రోడ్డు సేఫ్టీ పనులు

31-07-2025 01:09:50 AM

పాట్ హోల్స్,క్యాచ్ పిట్స్ మరమ్మతులపై జీహెచ్‌ఎంసీ దృష్టి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): వర్షాకాలం నేపథ్యంలో నగరంలో రోడ్డుపై గుంతలు (పాట్ హోల్స్), క్యాచ్ పిట్స్, రోడ్ కటింగ్ మరమ్మతులపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంజినీరింగ్ శాఖ అధికారులు ఇప్పటి వరకు నగరంలో 10,110 పాట్ హోల్స్ గుర్తించగా, వాటిలో 6,380 పాట్ హోల్స్ మరమ్మత్తులు పూర్తయ్యాయి.

గత రోజుతో పోలిస్తే, మంగళవారం నాటికి పూర్తియిన 5,893 పాట్ హోల్స్‌కు తోడు, బుధవారం 497 పాట్ హోల్స్ మరమ్మతు చేశారు. 296 క్యాచ్ పిట్స్ మరమ్మతు చేశారు. 92 క్యాచ్ పిట్ కవర్స్‌ను రీప్లేస్ చేశారు. 3 సెంట్రల్ మీడియన్ పనులు పూర్తి చేశారు. వర్షాకాలంలో ఈ పునరుద్ధరణ పనులు నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగమని కమిషనర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు.