calender_icon.png 7 October, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీ మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

07-10-2025 04:29:30 PM

నకిరేకల్ (విజయక్రాంతి): శ్రీ మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం కట్టంగూరు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మికి చిత్రపటానికి కట్టంగూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి.జ్ఞాన ప్రకాష్ రావు  పూలమాలలు, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కట్టంగూర్ మండల పంచాయతీ అధికారి కల్లెపురం స్వరూప రాణి, సూపరింటెండెంట్ చింతమల్ల చలపతి, కట్టంగూరు మండల ఏపీఓ కడెం రామ్మోహన్, సీనియర్ అసిస్టెంట్ మద్ది సులోచన, ఏ.పి.యం రాములు, సిసిలు, కంప్యూటర్ ఆపరేటర్లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.