calender_icon.png 7 October, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమురం భీం స్పూర్తితో పోరాడుదాం

07-10-2025 04:51:21 PM

నిర్మల్ (విజయక్రాంతి): జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాడిన కొమురం భీం ఆశలను నెరవేరుద్దామని ఆదివాసి జిల్లా నాయకులు వెంకయ్య గారి భూమయ్య అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కొమురం భీం జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కొమురం భీం, రాంజీ గౌడ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆదివాసుల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు వెళ్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లేష్, లక్ష్మణ్, శ్రీకాంత్, రాజేందర్, సాయన్న భోజన్న తదితరులు పాల్గొన్నారు.