07-10-2025 05:53:22 PM
సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రజల కష్టసుఖంలో పాల్గొంటూ, ఈ సమస్య వచ్చిన ప్రజల ముందు వాలేది ఎర్రజెండా నాయకులేనని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తోందని వెల్లడించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడుతున్న సీపీఐ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ల కోసం సీపీఐ పార్టీ చేసిన పోరాటంను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు నళిని రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాములు, ఝాన్సీ, ఆయా మండలాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.