07-10-2025 05:42:07 PM
బోథ్ (విజయక్రాంతి): జూనియర్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బోథ్ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కుమ్మరి విజయ్ కుమార్, ఏఐసీసీ విచార్ విభాగ్ తెలంగాణ కో ఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ తో కలిసి మంగళవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ లో తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి బి. పాపిరెడ్డికి వినతి పత్రం అందించారు. మొదట న్యాయశాఖ కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాపిరెడ్డికి విజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జూనియర్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన న్యాయశాఖ కార్యదర్శిని కోరారు. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను త్వరగా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై న్యాయశాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్లు కుమ్మరి విజయ్ కుమార్ తెలిపారు.