calender_icon.png 7 October, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ చట్టాన్ని గవర్నర్ ఆమోదించాలి..

07-10-2025 05:46:53 PM

రెడ్డి జాగృతి బీసీల పట్ల కుట్రను మానుకోవాలి..

బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ..

మునుగోడు (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ చట్టాన్ని గవర్నర్ ఆమోదించాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ అన్నారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. మాధవరెడ్డి బీసీల పట్ల మీ కుట్రను మానుకోవాలని వారు హెచ్చరించారు. రిజర్వేషన్ వ్యతిరేకులు రెడ్డి జాగృతి నాయకులు కోర్టులో రిజర్వేషన్ కోర్టుకు అడ్డుకునే ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా మండిపడ్డారు. హైకోర్టులో సుప్రీంకోర్టులో న్యాయమైన బీసీ రిజర్వేషన్ వాటాన్ని అడ్డుకోవాలని రిజర్వేషన్ వ్యతిరేకులు రెడ్డి జాగృతి నాయకులు చూడడం చాలా సిగ్గుమాలిన విషయం అని అన్నారు.

60% ఉన్నటువంటి బీసీలు స్థానిక ఎన్నికలు సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్ కావడం ఇష్టం లేక పిడికెడు శాతం ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని చెందినటువంటి మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి బీసీల నోటి ముద్దను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో చట్టం చేసిన బీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా కాలయాపన చేయడం చాలా విడ్డూరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గుంటూరు వెంకటాచారి, మాజీ ఉపసర్పంచ్ కొండ వెంకన్న, కొండా మల్లేష్, బక్క కృష్ణయ్య ,పంతంగి వెంకన్న, తన్నీరు నందివర్ధన్, బైరవని, భానుప్రసాద్, కొమురవెల్లి నాయి ఉన్నారు.