calender_icon.png 7 October, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వాల్మీకి జయంతి, కొమరం భీమ్ వర్ధంతి

07-10-2025 04:26:03 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి, కొమరం భీమ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జలంధర్ రెడ్డి మాట్లాడుతూ ఆదర్శ పురుషుడు శ్రీరాముని యొక్క జీవిత చరిత్రను కండ్లకు కట్టినట్లు రచించిన గొప్ప మహర్షి వాల్మీకి అని అన్నారు. అదేవిధంగా కొమరం భీమ్ గొప్ప పోరాట యోధుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజన్, రాధా కుమార్, సంయుద్దీన్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.