calender_icon.png 7 October, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమురం భీం కు ఘనంగా నివాళి

07-10-2025 05:13:51 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని చైన్ గేట్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం కొమురం భీం విగ్రహానికి పూలదండ వేసి 85వ వర్ధంతిని జరుపుకున్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆదివాసీ ముద్దుబిడ్డ, నిజాం సర్కార్ తో విరోచితంగా పోరాడి అమరుడైన నాయకుడి ఈ వర్ధంతి సందర్భంగా ఆ పోరాట యోధుడికి ఇవే మా ఘన నివాళులు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎస్ ఎన్ రెడ్డి, రవి బాబూలాల్ గంగయ్య పాల్గొన్నారు.