calender_icon.png 7 October, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

07-10-2025 05:03:07 PM

మందమర్రి (విజయక్రాంతి): రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు సింగరేణి యజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు  రామాయణం మహాకావ్యాన్ని రచించిన ఋషిని గౌరవించటానికి ప్రతి సంవత్సరం వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహిస్తున్నామన్నారు.

వాల్మీకి మహర్షి సంస్కృత సాహిత్యంలో ఆదికవి (మొదటి కవి) రామాయణ రచయితగా గౌరవిస్తూ ఆయనను స్మరించుకోవడం జరుగుతుందన్నారు. అన్నారు. వాల్మీకి చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, సీఎంఓఏఐ అధ్యక్షులు రమేష్, ఇన్చార్జి పర్సనల్ మేనేజర్ ఎండి ఆసీఫ్, సీనియర్ పిఓ సత్యనారాయణ, జిఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.