07-07-2025 12:13:26 AM
ఆవిష్కరించిన ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ, జూలై 6: చింతపల్లి మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆదివారం దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ ఆవిష్కరించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో గాంధీజీ అగ్రగణ్యుడు అని అన్నారు.
మహాత్మా గాంధీ భారత సమాజానికి ఒక వరం అని అన్నారు.సత్యం మరియు అహింసతో గాంధీజీ చేసిన ప్రయోగం ఆయనకు గొప్ప మానవ హోదాను ఇచ్చిందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ,కాంగ్రెస్ నాయకులు ,ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.