07-07-2025 12:14:32 AM
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జులై 6, (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళలో ఆదివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు.
కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించగా ఏడాదిలో తొలి పండుగ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.