04-05-2025 11:02:07 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్(Bellampalli Railway Station)లో అక్రమంగా గంజాయి తరలిస్తూ యువకుడు పట్టుబడ్డాడు. బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై కే. మహేందర్(SI K.Mahender) తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ ముందు ఆదివారం ఓ వ్యక్తి గంజాయితో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు ఘటన స్థలికి వెళ్లి గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు.
240 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని పోలీసులు విచారణ చేశారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింహర్ కు చెందిన మహమ్మద్ అని పోలీస్ విచారణ తేలింది. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచనామా చేసి నిందితుడ్ని బెల్లంపల్లి 2-టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండుకి చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.