04-05-2025 10:44:02 PM
కేంద్రమంత్రి కలిసిన బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): హైదరాబాద్ లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మని బీజేపీ తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డితో కలసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్వంచలో ఉన్న ఎన్ఎండిసి (సియిల్) ని తిరిగి పునరుద్దరించి 5000కి పైగా కార్మికులకు, ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించాలని, వినతిపత్రం అందించారు.
ఈ దరఖాస్తులు చూసి కేంద్రమంత్రి వెంటనే ఎన్ఎండిసి అధికారులకి ఫోన్ చేసి పునరుద్దరణకి సాధ్యసాధ్యాలని, అడిగి తెలుసుకున్నారు. తప్పకుండ పునరుద్దరణకి కృషి చేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... భద్రాద్రి జిల్లాకు ప్రాణవాయువు వంటిది ఎన్ఎండిసి ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం జేశారు.