04-05-2025 10:37:35 PM
ఇద్దరు మృతి...
మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. షామీర్పేట్ నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తున్న నైట్రోజన్ కంటైనర్ ను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్, మరొకరు అక్కడికక్కడే మరణించారు. మృతులను మేడిపల్లికి చెందిన యశ్వంత్, పీర్జాదిగూడకు చెందిన తాడిపత్రి చార్లెస్ గా గుర్తించారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.