04-05-2025 10:25:20 PM
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..
చెన్నూర్ (విజయక్రాంతి): చెన్నూర్ నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి(MLA Gaddam Vivek Venkataswamy) అన్నారు. ఆది వారం చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీపై నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమీషనర్ లతో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని, కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ది బాటలో పయనిస్తుందన్నారు.
చెన్నూర్ మండలంలోని సోమనపల్లిలో రూ.250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇందిరమ్మ ఇళ్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎంపిక చేస్తున్నామన్నారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇంటిని 60 చదరపు గజాలలో మాత్రమే కడితే బిల్లులు మంజూరవుతాయని, ఇల్లు మంజూరయిన నెలలోపే గృహ నిర్మాణం చేపట్టాలన్నారు. ఇంటి మంజూరుకు రెండు సార్లు వెరిఫికేషన్ చేసిన తరువాతనే లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ఒకే కుటుంబంలో ఇద్దరికీ ఇల్లు మంజూరు చేయడం జరగదన్నారు. ఈ రివ్యూ మీటింగ్ లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.