calender_icon.png 5 May, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధాశ్రమం సందర్శించిన దివ్య రెడ్డి

04-05-2025 10:53:39 PM

నిర్మల్ (విజయక్రాంతి): అనాథ వృద్ధులను ఆదుకోవడం అనేది అందరి బాధ్యత అని అల్లోల దివ్య రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్ మస్తాన్ దుబ్బ ప్రాంతంలో గల డవ్ అనాధ వృద్ధాశ్రమాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం, బట్టలు పంపిణీ చేశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సేవా భావంతో ఇలాంటి వృద్దాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం లాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని అన్నారు.