04-05-2025 10:31:08 PM
బిజెపి క్రమశిక్షణ సంఘం రాష్ట్ర చైర్మన్ మార్తినేని ధర్మారావు..
హనుమకొండ (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్లోని పహాల్గాంలో పర్యాటకులపై దాడులకు పాల్పడిన ఉగ్రముకలను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే బిజెపి క్రమశిక్షణ సంఘం చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు. జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో ముష్కరుల దాడిలో మృతి చెందిన పర్యటకులకు నివాళులర్పిస్తూ హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్తూపం వరకు శివాజీ యువజన భక్తమండలి అంబేద్కర్ సర్కిల్ హనుమకొండ ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులతో కలిసి కాగడాలు కొవ్వొత్తులతో ఆదివారం ర్యాలీ నిర్వహించారు.
ఉగ్రవాదులను శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ... పహల్గామాలో పర్యాటకులపై విచక్షణ రహితంగా దాడులు జరిపిన నరాంతకులను ఉపేక్షించవద్దని వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చాడ స్వాతి శ్రీనివాస్ రెడ్డి గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, శివాజీ యువజన భక్త మండలి ప్రతినిధులు కట్ల భాస్కర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, నరోత్తం రెడ్డి, అశోక్ రావు, ప్రదీప్ రావు, జానకి రామారావు లతో పాటు బిజెపి శ్రేణులు బింగి శ్రీనివాస్, శనిగరపు విజయ్, వాసుదేవ రెడ్డి నాగపురి వెంకటేష్, గుండు స్వామి, గట్టు రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.