calender_icon.png 19 May, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై దాడి నలుగురు జూదరుల అరెస్ట్

18-05-2025 08:52:50 PM

15,150/- నగదు, 4 సెల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాదీనం: ఎస్సై రాజశేఖర్

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంపోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ శివారులో  పేకాట ఆడుతు న్నారన్న సమాచారంతో  పోలీసులు దాడి చేసి నలుగురు జూదరులను అదుపులోకి తీసుకున్న ఘటన పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం విద్యానగర్ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పేకాట స్థావరంపై దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా అందులో ముగ్గురు పోలీసు లను చూసి పారిపోగ, నలుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకొని వారి నుండి రూ.15,150/– రూపాయలు, 4 మొబైల్ ఫోన్స్, 4 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో మోతే రాజయ్య, తుంగపిండి వినోద్, గరికే అశోక్ కుమార్, పంచమట్ల శ్రీకాంత్ లు ఉండగా,పైడి పవన్, పాస్తం గోపాల్, పూల కోటేశ్ లు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టు కుంటామన్నారు. పట్టణంలో అక్రమ దందాలు, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పటిష్టం చేసి, పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్లు  ఎస్సై స్పష్టం చేశారు. కాగా ఈ దాడుల్లో ఏఎస్ఐ మిలింద్ కుమార్, కానిస్టేబుళ్ళు గోపాల్, రాకేష్, విశ్వనాథ్, కృష్ణ, హోం గార్డ్ రవి లు పాల్గొన్నారు.