18-05-2025 09:07:49 PM
మునుగోడు,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో 6 మంది సభ్యులతో జాతీయ సమితికి అవకాశం కల్పించగా నల్గొండ జిల్లా ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తీర్పారి వెంకటేశ్వర్లును జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా తిరుపతిలో ఎన్నుకున్నారు. ఎలక్ట్రోల్ సంస్కరణల కొరకు దేశవ్యాపతంగా 5 కోట్ల యువతి యువకుల సంతకాల సేకరణకు ఏఐవైఎఫ్ జాతీయ సమితి పిలుపు మేరకు ఈనెల 15 నుండి 18 వరకు తిరుపతి పట్టణంలో జరిగిన ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల సందర్భంగా పలు కార్యక్రమాలను ప్రకటించారు. నవంబర్ నెలలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు యూత్ మార్చ్ చేపట్టనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల నుండి 600 ప్రతినిధులతో నాలుగు రోజులపాటు సుదీర్ఘ చర్చల అనంతరం నూతన కౌన్సిల్ ప్రకటించారు. 105 మందితో జాతీయ కౌన్సిల్ ప్రకటించగా 40 మందితో జాతీయ వర్కింగ్ కమిటీని సూచించగా నూతన కమిటీని ఎన్నుకున్నరు.