18-05-2025 08:46:36 PM
హనుమకొండ జిల్లా డిఎంహెచ్వో డాక్టర్ ఏ. అప్పయ్య
హనుమకొండ,(విజయక్రాంతి): "అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే" సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హనుమకొండ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల హనుమకొండ నుండి ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ వరకు కొవ్వొత్తులు వెలిగించి అవగాహన ర్యాలీ అనంతరం సంఘీభావ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ ఏ. అప్పయ్య మాట్లాడుతూ ఎయిడ్స్ తో మరణించిన వారిని స్మరించుకుంటూ, ప్రజలలో హెచ్ఐవి , ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగించడం, అలాగే ఎవరైతే హెచ్ఐవి వ్యాధితో జీవిస్తున్నారో వారికి, వారి కుటుంబ సభ్యులకు సంఘీభావంగా సపోర్టుగా ఉండేందుకు, కోసం ఈ కార్యక్రమం 1983 నుండి నిర్వహిస్తున్నామన్నారు. హెచ్ఐవి అవగాహన,నియంత్రణలో, పునరావాసం లో ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఎస్ఎస్ విబాగం, కృషి చేస్తున్నారని అన్నారు. విద్యార్థి దశ నుండి ప్రతి ఒకరు హెచ్ఐవి , ఎయిడ్స్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కలిగిస్తూ స్క్రీనింగ్ శాతాన్ని పెంచాలని, హెచ్ఐవి నిర్ధారణ అయినవారు ఎఆర్టి మందులు క్రమం తప్పకుండా వాడాలని వారికి ఫాలోఅప్ సేవలు అందించాలని సూచించారు.
అడిషనల్ డిఎమ్ హెచ్ ఓ డాక్టర్ టి. మదన్మోహన్రావు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి , టీబీ ఆసుపత్రి, సిఎస్సి పరకాల లో ఐసిటిసి సెంటర్లు పనిచేస్తున్నాయని, ప్రతి పీహెచ్సీ లో హెచ్ఐవి టెస్టింగ్ సదుపాయం అందుబాటులో ఉందని ,అలాగే మొబైల్ వాహనం ద్వారా టెస్టింగ్, కౌన్సిలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని , టీబీ ఆసుపత్రిలో ఉన్న సంపూర్ణ సురక్ష కేంద్రం ద్వారా అవగాహన కార్యక్రమములు , టెస్టింగ్, వైద్య శిబిరములు నిర్వహించడం జరుగుతున్నది అన్నారు అలాగే ఐదు స్వచ్ఛంద సంస్థలు హెచ్ఐవి నియంత్రణలో భాగస్వాములుగా పనిచేస్తున్నారన్నారు. 2024-25 లో 55,000 పరీక్షించగా 100 పాజిటివ్ లు నమోదయ్యాయి.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ గీతజిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మేనేజర్ స్వప్న మాధురి, ఐసీటీసి సూపర్వైజర్ రామకృష్ణ, కమలాకర్ పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం జి ఎం హెచ్ ఆరోగ్య సిబ్బంది , ఐ సి టి సి కౌన్సిలర్లు రాపర్తి సురేష్, రాజేందర్ , సంపూర్ణ సురక్ష కేంద్రం బృందం, ఇక్బాల్ భాషల్యాబ్ టెక్నీషియన్లు కరుణా మైత్రి పాజిటివ్ నెట్వర్క్ రవీందర్,మారి విజయ మోహన్ ట్రకర్స్ నవ్య,వర్డ్ గోవర్ధన్, కరునామైతిరి, ఆర్ డి ఎం ఎం ఈశ్వర్, వై.ఆర్.జి కేర్ లింక్ వర్కర్స్ నుండి ముస్తాక్,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు , సూపర్వైజర్లు ఆశాలు పాల్గొన్నారు.