18-05-2025 09:05:23 PM
పెన్ పహాడ్: తన సంఘ అభివృద్ధి లో భాగంగా తీవ్ర ఎండ సైతం లెక్కచేయకుండా కార్యక్రమానికి వెళ్లిన వికలాంగ యువకుడు వడ దెబ్బకు గురై మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన వికలాంగసంఘ నాయకుడు షేక్. ముజీబ్ (30) తన ట్రైసైకిల్ పైఈ నెల 16న, సూర్యాపేటలో జరుగుతున్న వికలాంగులకు ప్రభుత్వం అందజేస్తున్న ట్రై సైకిల్ పంపిణి కార్యక్రమంలో ఆయన పాల్గొని మండుటెండలో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ నేపథ్యంలో మృతుడు ముజీబ్ వడదెబ్బకు గురికాగా చికిత్స నిమిత్తం అంబులెన్సు లో పట్టణ జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.