18 April, 2026 | 6:18 AM

స్పోర్ట్స్ బ్రెయిన్ ట్రెయినింగ్ ల్యాబ్ ప్రారంభం

03-05-2025 02:38 AM

దేశంలోనే మొట్టమొదటి ట్రెయినింగ్ ల్యాబ్

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): ప్రపంచ స్థాయి విద్యతో పాటు అత్యుత్తమ క్రీడా శిక్షణ అందించే దిశగా మరో ముందడు గు పడింది. ఇందుకు దోహదపడే వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీ, సిక్స్ ఎస్ స్పోర్ట్స్ అధికారికంగా ప్రారంభమైంది. ట్రిషే ప్రైవేట్ లిమి టెడ్‌కు అనుబంధంగా సిక్స్ ఎస్ స్పోర్ట్స్ కొనసాగుతోంది. ఇప్పుడీ సంస్థ వోక్సెన్ స్పోరట్స్ అకాడమీతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ డెక్కన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పుల్లెల్ల గోపీచంద్ (ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యా డ్మింటన్ ఛాంపియన్, గోపీచంద్ అకాడమీ వ్యవస్థాపకులు), ఎమ్మెస్కే ప్రసాద్ (భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలెక్టర్), అంజు బాబీ జార్జ్ (వరల్ అథ్లెటిక్స్ పతక విజేత) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

వారితో పాటు డాక్టర్ రౌల్ రోడ్రిగ్జ్ (వైస్ ప్రెసిడెంట్, వోక్సెన్ యూనివర్సిటీ), ఆంటోనీ చాకో (డైరెక్టర్, సిక్స్‌ఎ స్ స్పోరట్స్, బిజినెస్ సొల్యూ షన్స్), అనిల్ నాయర్ (స్పోరట్స్ మీడియా, ఇన్వెస్ట్మెంట్ గ్లోబల్ సీఈవో) తదితరులు హాజరయ్యారు. వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీ, సిక్స్ ఎస్ స్పోర్ట్స్ ప్రత్యేకతలు.. ఆధునిక స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, అథ్లెట్ల కోసం మనదేశంలోనే తొలి బ్రెయిన్ ట్రైనింగ్ ల్యాబ్, ఏఐ ఆధారిత స్పోర్ట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్స్, స్పోర్ట్స్ సైన్స్, టెక్నాలజీలో రీసెర్చ్, విద్య, క్రీడల్లో డ్యుయల్ కెరీర్ మార్గాలకు అవసరమైన నిర్మాణాత్మక ప్రణాళిక, డ్యుయల్ కెరీర్, అథ్లెట్ ఎగ్జిట్ సపోర్ట్ ప్రోగ్రాం ఉంటా యి.

ఎలైట్ అకాడమీ భాగస్వామ్యాలు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ, అంజు బాబీ జార్జ్ స్పోరట్స్ ఫౌండేషన్ హై పర్ఫామెన్స్ సెంటర్, కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ అకాడమీ (స్పోర్ట్స్ హుడ్‌తో భాగస్వామ్యంగా) ఉన్నారు. కాగా, అథ్లెట్ ట్రాన్స్ ఫర్మేషన్ కోసం విద్యాసంస్థలు, క్రీడలను అనుసంధానించాల్సిన అవసరం ఉందని రౌల్ రోడ్రిగ్జ్ అభిప్రాయపడ్డారు.

క్రమశిక్షణ, లైఫ్ ప్లానింగ్ వంటి అంశాలపై ఎర్లీ స్కూ లింగ్ లో తప్పకుండా నేర్పించాలని సంయు క్త ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్మన్ రితేష్ గౌడ్ సూచించారు. ఎడ్యుకేషన్, గైడెన్స్ తో పాటు ప్రపంస స్థాయి అవకాశాలను అందిస్తుందని పుల్లెల్ల గోపీచంద్ తెలిపారు. డిజిటల్ రీచ్, అథ్లెట్ అసెస్ మెంట్స్, స్కేలబుల్ మెం టర్ షిప్ కు సంబంధించి వోక్సెన్ విజన్ కు మద్దతివ్వడమే తమ లక్ష్యమని  రాహుల్ ఆంటోనీ థామస్ వెల్లడించారు.