calender_icon.png 28 October, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా అధ్యక్షుడిగా మహేష్ వర్మ

28-10-2025 02:57:45 PM

మంచిర్యాల,(విజయక్రాంతి):  తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా మహేష్ వర్మ (MAHESH VARMA) ని నియమిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న (TEENMAR MALLANNA) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మహేష్ వర్మ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నాయకులకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ (KOMMULA PRAVEEN) లకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, రానున్న రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీని మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా నాయకులు పాకాల దినకర్, దాస్యపు దీపక్, సీపతి సాయి కుమార్, బండారి చిరంజీవి, మోటపలుకుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.