28-10-2025 02:55:20 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో 8 గొర్రెలు మృతి చెందాయి.ఈ సంఘటన మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది.గ్రామానికి చెందిన గొర్రెల కాపరి పగిరి వీరయ్య తన గొర్రెల మందను సోమవారం రాత్రి ఇంటి సమీపంలోని దొడ్డిలోకి తోలాడు. అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు గుంపుగా గొర్రెల మందపై దాడి చేశాయి.మంగళవారం తెల్లవారుజామున వీరయ్య దొడ్డి వద్దకు వచ్చి చూడగా వీధి కుక్కల దాడిలో 8 గొర్రెలు మృతి చెందగా 4 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయని కన్నీటి పర్వంతమయ్యాడు.చనిపోయిన గొర్రెల విలువ రూ.లక్ష ఉంటుందని,ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నాడు.