05-05-2025 02:41:58 AM
జిల్లా అధ్యక్షుడు కె .చంద్రశేఖర్
కామారెడ్డి టౌన్, మే 4 (విజయ క్రాంతి) : ఈనెల 20వ తేదీన దేశవ్యాపితంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే చంద్రశేఖర్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయం దగ్గర జరిగిన కామారెడ్డి పట్టణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చారని 4 లేబర్ కోడ్ లను తెచ్చి కార్మికులకు హక్కులు లేకుండా చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు మే 20వ తేదీన జాతీయ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు.
ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా లోని అన్నిరంగాల కార్మిక వర్గం 20వ తేదీన జరిగే సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అంగన్వాడి టీచర్లు మినీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు సమ్మె కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది