17-07-2025 04:46:56 PM
చండూరు,(విజయక్రాంతి): కాశమల రాములు ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని ఆయన మృతి బిజెపి పార్టీకి తీరని లోటని బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు కోమిటి వీరేశం, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు అన్నారు. గురువారం చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులుకాశమల్ల రాములు అనారోగ్యంతో మరణించారన్న విషయం తెలుసుకొని వారు రాములుమృతదేహానికి పూలమాలలు వేసి నివాళులుఅర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలు మర్చిపోమని ఆయన వారిని కొనియాడారు.
వారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు తెలిపారు. అనంతరం దహన సంస్కారాల కోసం బిజెపి పార్టీ శ్రేణులు అందరూ కలిసి రూ.40,116 వేలు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. బిజెపి పార్టీ తరఫున వారు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మురళి మనోహర్ రెడ్డి, సీనియర్ నాయకులు చిలుకూరి అశోక్, రావిరాల శ్రీను, అన్నేపర్తి యాదగిరి, జెర్రిపోతుల రాజు,మాధగోని నాగార్జున, యువ మోర్చా రాష్ట్ర నాయకులు భూతరాజు శ్రీహరి, పట్టణ ప్రధాన కార్యదర్శి సోమశంకర్, మండల కార్యదర్శి దాసరి శంకర్, బూత్ అధ్యక్షులు పుల్కరం నాగరాజు, ఎత్తపు పరమాత్మ రావు, జక్కలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.