17-07-2025 04:51:29 PM
చండూరు,(విజయక్రాంతి): జియో ట్యాగ్ ఉన్న చేనేత కార్మికులందరికీ చేనేత భరోసా కల్పించాలని, చేనేత రుణమాఫీలో నిబంధనలు సడలించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కర్ణాటి వెంకటేశం అన్నారు. గురువారం గట్టుపల్ మండల కేంద్రంలో చేనేత కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చేనేత కార్మికుల మగ్గాలకు, జియో ట్యాగ్ కలిగిన చేనేత కార్మికులకు రూ.18000 వేలు, అనుబంధం కార్మికునికి రూ.6000 వేలు వెంటనే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రతి చేనేత కార్మికునికి నిబంధనలు లేకుండా రుణ మాఫీ చేయాలని ఆయన అన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వాలని ఆయన అన్నారు. చేనేత చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించాలని, చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు. అర్హులైన నేత కార్మికులకు జియో ట్యాగ్ నెంబర్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.