17-07-2025 04:56:22 PM
సూర్యాపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రంథాలయాలను ఆకస్మికంగా పరిశీలించి, అవసరమున్న చోట నూతన బిల్డింగ్ నిర్మాణాల కోసం శ్రీకారం చుట్టినట్లు సూర్యాపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి నాగారం జాజిరెడ్డిగూడెం తుంగతుర్తి నూతనకల్ నిమ్మికల్ గ్రంథాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సుమారు 1 కోటి 50 లక్షలతో నూతన బిల్లింగ్ నిర్మాణం పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లోని గ్రంథాలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. సూర్యాపేట జిల్లాలో బడుగు బలహీన వర్గాల యువతి యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరంతరం కష్టపడి చదివి ఉన్నతమైన ఉద్యోగాలు పొందడం గర్వించదగ్గ విషయం అన్నారు. తుంగతుర్తి గ్రంధాలయం ఇరుకుగా ఉన్నందున, తక్షణమే నూతన బిల్డింగ్ నిర్మాణం కోసం జిల్లా మంత్రి నల్ల మాస ఉత్తంకుమార్ రెడ్డితో మాట్లాడి ప్రత్యేక నిధులు మంజూరు కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విశ్రాంతి ఉద్యోగుల భవనంలో తుంగతుర్తి మండలం లోని ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. పలువురు ఆర్యవైశ్యులు ఆర్యవైశ్య సంఘం భవనము ప్రహరీ నిర్మాణానికి నిధులు ఇప్పించాలని కోరగా, సంతృప్తిని వ్యక్తం చేశారు.