17-07-2025 05:00:50 PM
గ్రామాల్లో నిత్యం పారిశుద్య పనులు నిర్వహించాలీ
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సనుగుల, రామారావుపల్లెలో ఆకస్మిక తనిఖీ
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలోని చందుర్తి మండలం దిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకొని.. ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. చందుర్తి మండలంలోని రామారావు పల్లె గ్రామపంచాయతీ కార్యాలయం ఎదురుగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువగా తిరగడం గమనించిన కలెక్టర్ వాటిని నియంత్రించాలని పంచాయతీ సెక్రెటరీ, అధికారులకు ఆదేశించారు.
గ్రామాల్లో నిత్యం పారిశుద్య పనులు నిర్వహించాలి
సనుగుల గ్రామపంచాయతీ పరిధిలో రహదారుల వెంట ఇరువైపులా గడ్డి, నిరుపయోగ మొక్కలు పెరగడం, రహదారి వెంబడి వర్షపు నీరు ఉండడాన్ని కలెక్టర్ పరిశీలించారు. రోడ్ల వెంట గడ్డి, ఇతర మొక్కలు వెంటనే తొలగించాలని, నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో నిత్యం పారిశుద్య పనులు చేయించాలని, నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.