17-07-2025 05:04:18 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): పద్మ శ్రీ అవార్డు గ్రహీత, ఎంఆర్పీఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగని కరీంనగర్ లో నాయకులు నక్క ప్రమోద్ మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు పాఠశాలల, కళాశాలలలో ఎదుర్కొంటున్న సమస్యలను మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకువెళ్లారు. మౌలిక వసతులు, ప్రత్యేక టాయిలెట్లు, రాంపులు, లిఫ్ట్‌లతో పాటు, అందుబాటులో బస్సులు వంటి సౌకర్యాల ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 15 శాతం ఎస్సీ రిజర్వేషన్, మాదిగ వర్గీకరణ శాతం అమలు జరిగేలా చూడాలని మందకృష్ణ మాదిగ ను కోరారు.