20 July, 2026 | 9:25 PM

సంతోష్ నగర్‌లో ఘరానా మోసం

20-07-2026 02:38 AM

పేదలకు ప్లాట్లు అమ్మి.. ముఖం చాటేసిన ఘనుడు                                            

జవహర్‌నగర్, జూలై 19 (విజయక్రాంతి): పైసా పైసా కూడబెట్టి పేదలు ప్లాట్లు కొంటే ఓరియల్టర్ పత్తాలేకుండా పారిపోయిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంతోష్ నగర్ లో ఆదివారం బాధితులు మీడియాతో మాట్లాడుతూ జవహర్ నగర్ సంతోష్ నగర్ లో నివసించే కనిగంటి వెంకటేష్ (42) అమాయక పేదలను ఆసరాగా చేసుకుని అక్రమంగా ప్లాట్లను అమ్ముతూ సొమ్ము చేసుకున్నాడు. అమ్మిన ప్లాట్లను చూపకుండా మరో చోటుకు మార్చుతూ కాలం వెలదీస్తూ వచ్చాడు.

ప్లాట్లు చూపాలంటూ బాధితులు నిలదీయడంతో ఇస్తామంటూ నమ్మబల్కుతూ పేదలను నిండా ఉంచాడు. సుమారు రెండు కోట్ల మేరకు బాధితుల నుంచి వసూలు చేసి చక్కగా రాత్రికి రాత్రే కుటుంబ సభ్యులతో సహా పారిపోయాడని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీస్ స్టేషన్ సమీపంలో చెన్నాపూర్ మల్కారం ప్రాంతాలలో అక్రమ లేఅవుట్లు వేస్తూ పేదలకు అమ్ముతూ భారీ మోసానికి పాల్పడ్డాడని తెలిపారు. ఒక్కరి వద్ద ఐదు లక్షల నుండి 10 లక్షల వరకు వసూలు చేసి నోటరీలు చేశాడని పేర్కొన్నారు. వెంకటేష్ శనివారం రాత్రి గుర్తు తెలియని ప్రాంతానికి మకాం మార్చాడు.