06-11-2025 08:23:51 PM
జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి అజ్మీర పురుషోత్తం నాయక్..
మందమర్రి (విజయక్రాంతి): అమ్మకు అక్షరం మాల కార్యక్రమం 2025-26 ను విజయవంతం చేయాలని జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి అజ్మీర పురుషోత్తం నాయక్ కోరారు. ఉల్లాస్ కార్య క్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని మండల విద్యాశాఖాధికారి కార్యాల యంలో ఓబీ లు, విఓఏ లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. ఉల్లాస్ కార్యక్రమంలో బాగంగా మండలంలో నిరక్షరాస్యులను గుర్తించి, వారికి చదువు నేర్పించుటకు వాలంటీర్ టీచర్స్ ను గుర్తించి, ఉల్లాస్ ఆప్ లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
నిరక్షరాస్యులను అక్షరాస్యు లుగా చేసే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి, ప్రతి గ్రామ సంఘం నుండి ఇద్దరు ఓబిలకు, విఓఏ లకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన సిఆర్పి లచే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని గ్రామస్థాయిలో ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని అంకితభావంతో అందరూ కలిసి విజయవంతం చేసి, జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ పి సతీష్ కుమార్, ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్, విద్యాశాఖాధికారి దత్తు మూర్తి, మండల సమాఖ్య అధ్యక్షురాలు అనిత, ఏపీఎం చంద్రశేఖర్, సుమలత, చైతన్య, ఎస్ఈఆర్పి సిఆర్పి లు రజిత, స్వప్న, మహిళా సమాఖ్య కార్యాలయ సిబ్బంది మండలంలోని అన్ని గ్రామాల ఓబి లు, విఓఏ లు పాల్గొన్నారు.