06-11-2025 08:27:50 PM
మల్యాల (విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మల్యాలలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కేసు విషయంలో పోలీస్ స్టేషన్ గేటు పైకి ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటీవల తన తల్లి మరణం పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేశాడు. సరైన న్యాయం జరగవులేదని కారణంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడున్న వారు అడ్డుకుని సదరు యువకుడిని కిందకి దింపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.