calender_icon.png 16 November, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డివైఎఫ్ఐ 17వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

16-11-2025 04:48:49 PM

నకిరేకల్ (విజయక్రాంతి): నవంబర్ 20, 21 తేదీలలో తిప్పర్తి మండల కేంద్రంలో జరిగే భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా 17వ మహాసభలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ కేతేపల్లి మండల కన్వీనర్ చెరుకు రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం కేతేపల్లి మండలంలో ఆ సంఘం మహాసభల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివైఎఫ్ఐ సంఘం 17వ నల్గొండ జిల్లా మహాసభలు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు.

ఈ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడిన 400 మంది ప్రతినిధులతో మహాసభలను నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభలో చర్చిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ఊర శ్రీకాంత్,  గణేష్ ,సతీష్, నాగరాజు, రమేష్, రాము ,పరమేష్ పాల్గొనారు.