calender_icon.png 17 October, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంద్‌ను జయప్రదం చేయండి

17-10-2025 01:19:08 AM

-బి.సీ అడ్వకేట్ జే ఏసీ

నల్గొండ టౌన్, అక్టోబర్ 16: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటున్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా అక్టోబర్ 18 తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని బీసీ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ లు జెనిగల రాములు,గిరి లింగయ్య గౌడ్, విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కోర్టులో; బంద్; పోస్టర్ ను బి.సి అడ్వకేట్ జేఏసీ అధ్వర్యంలో కోర్టు ఆవరణంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం అంటేనే కుల పునాదుల మీద నిర్మితమైన వ్యవస్థ అన్నారు.

జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణలో ఉద్యమం కొనసాగుతుందన్నారు.జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఒక ప్రజాస్వామిక బద్ధమైన సూత్రమని,.రిజర్వేషన్ల లక్ష్యం సామాజిక వర్గాల మధ్య సమానత్వం సాధించడమే తప్ప సామాజిక వర్గాల లోపల అసమానత్వం సాధించడం కాదన్నారు.రిజర్వేషన్లకు సం బంధించి భారత రాజ్యాంగంలో నిర్ణితమైనటువంటి పరిమితి విధించలేదన్నారు.పలు సందర్భాలలో ఆయా రాష్ట్రాలలోని హైకోర్టులలో ను,కేంద్రంలోని సుప్రీం కోర్టు లో జరిగిన వాదనల ద్వారా గీసిన సరిహద్దు గీతలు ఉన్నాయని, ఆ గీతలను దాటి రిజర్వేషన్లను పెంచిన సందర్భాలు ఉన్నాయ న్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ వద్దకు పంపడం జరిగిందన్నారు. రాష్ర్టంలోని అన్ని పార్టీలు ఏలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఏకపక్షంగా ఆమోదం తెలిపినాయన్నారు. తెలంగాణలోని బుద్ధి జీవులు విద్యావంతు లు మేధావులు మొత్తంగా తెలంగాణ సమా జం స్వాగతించిందన్నారు.కాని జరగాల్సిన ప్రక్రియను జరగకుండా కొంతమంది వ్యక్తు లు కొన్ని స్థాయిలలో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయన్నారు. 42%; బి.సీ రిజర్వేషన్ల పెంపు దిశగా వివిధ రూపాలలో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల పై ఒత్తిడి పెంచడానికి స్పష్టమైన కార్యాచరణతో ఉద్యమం కొనసాగుతుందన్నారు.

అందులో భాగంగా అక్టోబ ర్ 18న తెలంగాణ బంద్‌కు వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేసే దిశగా అక్టోబర్ 18 బంద్ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించాల్సిందిగా  విజ్ఞప్తి చేశారు.  కార్యక్రమంలో న్యాయవాదులు ఆదిరెడ్డి, జి.జవహ్రలాల్,నేతి రఘు పతి, ఎండి నజీరుద్దిన్,  సత్తయ్య, లింగంపల్లి సురేష్, జలేంధర్, పజ్జురి స్వామి గౌడ్, పందుల సైదులు, ఇందిర, ఏ.ఐలయ్య,  నరసింహ, బి.శ్రీనయ్య, అప్రోజ్ ,వంశీ,్ర పేం సుందర్, రవీందర్, శంకర్ బాబు, జోగు నగేష్, యాదగిరి, అరుణ్ పాల్గొన్నారు.