12-12-2025 12:12:45 AM
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
చిన్నచింతకుంట డిసెంబర్ 11 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం రోజున చిన్న చింతకుంట మండలంలోని పెద్ద వడ్డేమాన్, చిన్న చింతకుంట గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ఎ. ఈశ్వర్ సింగ్ ని కత్తెర గుర్తు పై అదేవిదంగా చిన్నచింత కుంట అభ్యర్థి ఎస్ పుష్పలత ( ఉంగరం గుర్తు) లపై ఓటు వేసి, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అంతకుముందు చిన్న చింతకుంటకు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే జియంఆర్ కి డప్పు,
వాయిద్యాలతో పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ గ్రామాలలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసామని, సకాలంలో వారికి బిల్లులు వారి అకౌంట్ లలో పడుతున్నాయని, ఏప్రిల్ లో రెండో విడత ఇండ్లకు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 500 కే సిలిండర్, రెండు లక్షల రుణమాఫీ చేశామని, దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ పై సన్నబియ్యాన్ని ఇస్తున్నామని తెలిపారు.అంతేకాక దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని, చిన్న చింతకుంట మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని, దమగ్నాపూర్ 200 కోట్లతో అంతర్జాతీయ స్థాయి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, 45 కోట్లతో పల్లమరి వద్ద ఏటిసి కాలేజ్ నిర్మించుకోబోతున్నామని,
దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో 35 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి, 110 కోట్లతో కురుమూర్తి దేవస్థానం వద్ద ఎలివేటేడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని, త్వరలో పనులు పూర్తవుతాయని అన్నారు.నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆశీర్వదించాలని, గ్రామాల అభివృద్ధి అభివృద్ధిలో మీరు సైతం భాగస్వాములై కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించి, గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.